కార్తీక మాస విశిష్టత
కార్తీక మాస విశిష్టత
కార్తీక మాసం నదీ స్నానాలు, దీపారాధన, ఉపవాసాలు, దానాలు ఇలా ఎన్నో పుణ్యాచరణకి తద్వారా ఆత్మోద్ధరణకి అవకాశమిచ్చే మాసం. అందుకే స్కాంద పురాణంలో
“న కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం,
నచ వేద సమ శాస్త్రం న తీర్థం గంగాయాత్సమం”
“కార్తీకమాసంతో సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు” అని చెప్పారు.
కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు ప్రకాశించే మాసం కాబట్టి కార్తీక మాసం అని పేరు. శివకేశవులిద్దరినీ ఆరాధించే మాసం. విష్ణువుని దామోదరునిగానూ, శివుడిని త్ర్యంబకునిగానూ కొలిచే మాసం.

ఉపాసనా కాలమైన దక్షిణాయన కాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) మొదలు, మనలోకి మనం అంతర్ముఖులమై, భగవత్ తత్త్వాన్ని, ఆత్మ తత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటానికి అనువైన కాలం. అందుకే తొలి ఏకాదశి మొదలు మనకు రకరకాల పూజలు, నోములు, వ్రతాలు, పండుగలు పేరుతో మన మనస్సుని భగవంతునితో అనుసంధానం చేసేందుకు ఋషులు నిర్ణయం చేసారు. అంతటి ఉత్తమమైన దక్షిణాయన కాలంలో ఉత్కృష్టమైనది కార్తీక మాసం. ఈ మాసంలో “దీపం జ్యోతీ పరంబ్రహ్మ” అని ఆ పరమాత్మజ్యోతి రూపంలో కొలువుంటాడు. సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రాలుగా కలిగిన త్రినేత్రుడిని అగ్ని రూపానికి సంకేతమైన జ్యోతి రూపంగా ఆరాధన చేస్తాము, దీపాన్ని వెలిగించినా, పూజ చేసినా, దానం చేసినా చివరకు దీపాన్ని కన్నులతో చూసి నమస్కారం చేసినా చాలు, విశేషమైన ఫలం వస్తుంది. అందుకే “దీపేన సాధ్యతే సర్వం”.
దీనికి సంకేతంగా ఆశ్వయుజ మాసం చివరి రోజైన దీపావళి రోజే దీపాల వరుసతో కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు. అప్పటినుండి ఆ నెలంతా దీపాలు వెలిగిస్తారు. దీని వెనుక ఆరోగ్యకరమైన అంశం కూడా ముడి పడి ఉంది. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా వెళ్తుంటాడు. సూర్యుడు తులారాశిలో ఉండే ఈ మాసంలో వాతావరణం చల్లబడుతుంది. “ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” అనే వాక్యాన్ననుసరించి సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడకపోవడం వలన, అంతే కాకుండా వర్షాలు వెనుకపట్టే కాలం, పంట కోతలు జరిగే కాలం కూడా కావడం వల్ల కీటకాలు వల్ల , వివిధ రకాలైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో ఆవునేతి, నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం వల్ల వాటినుండి వచ్చే పొగ, చుట్టుపక్కల కలుషితం అయిన వాతావరణాన్ని శుద్ధి చేసి, మన ఆరోగ్యాన్ని చక్కబరుస్తుంది. పురాణాంతర్గతమైన విషయాన్ని పరిశీలిస్తే శివుని తేజస్సుని ధరించిన అగ్నిదేవుడు గంగలో విడిచిపెట్టగా ఆమె శరవణంపై విడిచిపెట్టింది. బాలుడైన షణ్ముఖునికి కృత్తికా మాతృ గణం పాలిచ్చిన కారణాన నక్షత్రమండలంలో స్థానం సంపాదించుకున్నారు. కార్తీక మాసంలో అగ్ని ఆరాధన వలన కార్తికేయుడు, తద్వారా కృత్తికాగణాల అనుగ్రహం కలుగుతుంది.
కార్తీక మాసంలో తెల్లవారుఝామున నదీస్నానాలు పరమపవిత్రంగా భావిస్తారు. ఆశ్వయుజ, కార్తీక మాసాలలో చంద్రుడు అత్యంత చల్లదనంతో అమృతంతో సమానమైన శక్తిని కలిగి ఉంటాడు. ఆ శక్తిని గ్రహించిన నదులు తమలో ఓషధీ గుణాలు కలిగి ఉంటాయి. ఆ గుణాలు వాతావరణం ఇంకా కలుషితం కాని తెల్లవారుజామున మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో నదీ స్నానం ఆచరించడం వల్ల మన శరీరం మరింత శక్తివంతమై, తాజాదనంతో కాంతివంతంగా మారుతుంది. ఇలా ఆరోగ్యపరంగానే కాకుండా చలిలో తెల్లవారుజామునే లేవడం, నదీస్నానం ఆచరించడం వల్ల మనోనిగ్రహం కూడా అలవడుతుంది. పవిత్రమైన భావనలు కలుగుతాయి.
దీపారాధన ఆ పరబ్రహ్మాన్ని దీప రూపంలో(అగ్ని) ఆరాధించడం వల్ల “తమసోమా జ్యోతిర్గమయా” తమలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానం వైపుగా ప్రయాణించమనే సంకేతమ్. ఈ నెలంతా దీపాలు ఉభయసంధ్యల్లో వెలిగిస్తారు. నెలంతా దీపాలు వెలిగించినప్పటికీ, కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపాలకు విశిష్టత ఉంది. ఆ రోజు 365 వత్తులతో చేసిన దీపాల గుత్తి వెలిగిస్తారు. దీనిద్వారా సంవత్సరంలో ఏదేని రోజులలో కారణాంతరాలవల్ల దీపం పెట్టని దోషం ఉంటే అది తొలగిపోతుంది. అంతే కాకుండా ఇంకొక విశిష్టమైన ప్రయోజనం ఉంది. కార్తీకదీపం వెలిగిస్తూ “కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః ……” అనే శ్లోకం చదువుతారు. దానివల్ల ఈ దీప ప్రయోజనం వెలిగించిన వారికే కాదు, కీటకాలు, వృక్షాలు, జలచరాలు వంటి మానవేతర జీవులను ఉద్ధరించగల శక్తి కూడా లభిస్తుంది. ప్రత్యుపకారం చేయడం మానవుని కనీస కర్తవ్యం. ఇతర జీవులనుండి అనేకమైన ప్రయోజనాలు పొందుతున్న మానవుడు, తన వంతు కర్తవ్యంగా దీపారాధన ఫలితాన్ని ఇతర చరాచర జీవులకు కూడా అందేట్టు చేసే అవకాశం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపాల వల్ల కలుగుతుంది
ఈ కార్తీక మాసంలో శక్తి ఉన్నవారు నెలంతా నక్తాలు చేస్తారు. అనగా ఉదయం నుండీ ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం అయిన తరువాత ఆహారం స్వీకరిస్తారు. అలా చేయలేని వారు చవితి, ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలలో ఉపవాసం ఆచరిస్తారు. ప్రత్యేకించి చంద్రుడు అధిక ప్రభావం కలిగిఉన్న, మరియు శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాలు ఉపవాసం ఉంటారు. భగవదారాధనలో కాలం గడుపుతారు.
ఈ నెలలో చేసే దానం విశేషమైన ఫలాన్నిస్తుంది. ప్రత్యేకించి దీపదానాలు, సాలగ్రామ దానాలు వంటివి చేస్తారు.
కార్తీకమాసానికే ప్రత్యేకమైన వనభోజనాలు సామాజిక సంబంధాలు బలపడేటట్లు చేస్తాయి. ఉసిరి, తులసి చెట్ల వద్ద, పిల్లా, పెద్దా అంతా చేరి, భగవంతుని ఆరాధించి, పుణ్య కథా కాలక్షేపం, సత్కాలక్షేపం చేసి, భగవంతునికి నివేదించిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ కాలంలో ఉసిరిలో అమూల్యమైన ఔషధ గుణాలుంటాయి. ఉసిరిచెట్టు గాలి మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపచేస్తుంది. ఇక తులసి లో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అమృత తుల్యమైనది. అందుకే ఉసిరివనంలో, తులసివనంలో వీలైనంత సమయం గడపాలని చెప్తారు. తులసి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది.
కార్తీకమాసం నెలంతా పవిత్రమైనదే, కానీ ప్రత్యేకించి కొన్ని రోజులు పరమ పవిత్రంగా ఎంచబడ్డాయి. ఆ రోజుల గురించి సంక్షిప్త వివరణ:
కార్తీక శుద్ధ పాడ్యమి: (బలిపాడ్యమి)
కార్తీక శుద్ధ పాడ్యమి ని బలిపాడ్యమి గా జరుపుకుంటాము. బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా కోరి మూడవ అడుగు బలి చక్రవర్తి తలపై ఆన్చి అతడిని పాతాళ లోకానికి పంపేశాడు వామనుడు. ఆ తర్వాత విష్ణుమూర్తి బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చి ఏదైనా వరం కోరుకొమ్మని అడుగగా, ప్రభూ, నా సర్వస్వమూ నీకే అర్పించాను. ఇక నాకు ఎటువంటి ఆశలూ లేవు. కానీ, లోక శ్రేయస్సు కొరకు ఒకవరం అడుగుతాను, దయుంచి ప్రసాదించమని అడుగుతాడు బలిచక్రవర్తి. అది ఎదో కొరుకొమ్మంటాడు విష్ణుమూర్తి. అయితే నువ్వు నావద్ద దానం పట్టిన ఈ మూడు రోజులూ అనగా నరక చతుర్దశి, దీపావళి మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజులలో ప్రతి ఇంటా నా రాజ్యం ఉండేలా అనగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించేలా, ఆ దీపాలు వెలిగిన ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువుండేలా వరమివ్వమని అడిగాడు బలిచక్రవర్తి. అతడి మాటను మన్నించి, తథాస్తు అన్నాడు విష్ణుమూర్తి. అందువల్లనే ఈ మూడు రోజుల్లోనూ ప్రతి ఇంటా దీపాలు వెలిగించి మావిడి తోరణాలతో కళకళలాడుతూ అలంకరిస్తారు. ఈ కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలి మరియు గదాధరుడైన శ్రీ మహావిష్ణువు పర్యటిస్తారు. ఏ ఇంట అంధకారం అలముకుని ఉంటుందో ఆ ఇంట అలక్ష్మి కొలువుంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈ కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమిగా జరుపుకుంటారు. ఈనాడు బలిచక్రవర్తినీ, గోవర్ధనగిరినీ పూజించడం మరియు శక్తి కొలదీ దానధర్మాలు చేయడం వంటివి శుభప్రదం మరియు పుణ్యప్రదమని శాస్త్రవచనం.

కార్తీక శుద్ధ విదియ : (భగినీ హస్త భోజనం)
భగినీ హస్త భోజనంగా పిలువబడే ఈ రోజున ప్రతీ సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తింటాడు. ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చెప్పబడింది. యమధర్మరాజు మరియు యమునానది సోదర సోదరీమణులు. యమధర్మ రాజు తన సోదరి ఇంటికి ఆమె ఆహ్వానాన్ని మన్నించి ఆమె ఇంటికి సపరివార సమేతంగా వెళ్లి ఆమె చేతి వంట ఎంతో ఆత్మీయత మరియు అభిమానాన్ని కలిపి వడ్డించగా, యమధర్మ రాజు ఎంతగానో సంతోషించి ఆమెను ఏమి కావలెనో కోరుకొమ్మనెను. అందుకు ఆమె నీవు మా ఇంటికి వచ్చి ఆత్మీయతతో మన బంధాన్ని బలపరుస్తూ నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆనందపరిచిన ఈ ‘కార్తీక శుద్ధ విదియ’ రోజునే భగినీ హస్త భోజనంగా జరుపుకోవాలని వరం కోరుకుంది. అందుకు సంతసించి తథాస్తు అని ఆమెకు వరాన్ని ప్రసాదించాడు యమధర్మరాజు. అదే సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఈ భగినీ హస్త భోజన వేడుకలను జరుపుకుంటాము. ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పర్వదినం ఎంతో శ్రద్ధతో జరుపుకుంటారు. ఈనాడు సోదరి ఇంటికి, సోదరులు వెళ్లి ఆమె చేతి విందు ఆరగించి తమ బంధాన్ని మరింత ఆత్మీయతతో బలపరచుకుంటారు.

కార్తీక శుద్ధ చవితి: (నాగుల చవితి)
నాగులను ఆరాధించే ప్రత్యేకమైన రోజు. దీపావళి నాడు దివిటీలు కొడుతూ మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటారు. సంతానం లేనివారు ఈ రోజు నాగేంద్రుణ్ణి పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. ఈనాడు పుట్టలో పాలు పోస్తూ నాగేంద్రుణ్ణి తమనీ, తమవారినీ రక్షించమని వేడుకుంటారు. “తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాళ్ళనుకో, పడగ తొక్కితే పారిపో”అంటూ ఆయన అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.

కార్తీక శుద్ధ ఏకాదశి : (ఉత్థాన ఏకాదశి)
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన ఆ శేష శయనుడు యోగనిద్ర నుండి లేచే పర్వదినమిది. ఈ రోజుతో చాతుర్మాస్య వ్రత దీక్ష పూర్తవుతుంది. కొంతమందికి కార్తీక పౌర్ణమి నాడు పూర్తవుతుంది. ఈనాడు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు మాత్రమే కాక , మిగతా వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. శుక్ల పక్ష ఏకాదశి పరమ పవిత్రమైన పుణ్య దినం.

కార్తీక శుద్ధ ద్వాదశి : (క్షీరాబ్ది ద్వాదశి)
శ్రీమన్నారాయణుడు తులసీ బృందావనంలో ప్రవేశించే పుణ్య దినమిది. ఈనాడు తులసీ ధాత్రీ(ఉసిరి) సమేత కార్తీక దామోదరుణ్ణి సేవిస్తారు. ఈరోజు ఉసిరి చెట్టు వద్ద పూజ చేస్తారు. ఉసిరి కాయలనే ప్రమిదలుగా చేసి ఆవునేతి దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు చేసిన దీపదానంగానీ, సాలగ్రామ దానం గానీ ఎన్నో రెట్లు పుణ్య ఫలాన్నిస్తుంది.

కార్తీక పౌర్ణమి :
పరమ పవిత్రమైన పుణ్యతిథి ఈ రోజు. పైన చెప్పినట్లుగా ప్రదోష వేళ దీపాల గుత్తి వెలిగించడమే కాకుండా జ్వాలా తోరణం నిర్వహిస్తారు. అంటే, పరమేశ్వరుడే స్వయంగా జీవుడు చేసిన పాపాలన్నింటినీ, అగ్ని జ్వాలల్లో దగ్ధం చేసి, పుణ్యం సంపాదించుకునేందుకు అర్హతని ప్రసాదించే రోజు. ఈనాడు దీపాల కాంతిలో అన్ని ప్రదేశాలూ వెలిగిపోతుంటాయి. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచల క్షేత్రమందు వెలిగించే ఆకాశ దీపం, కార్తీక దీపం ఎంతో ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు దీనిని దర్శించడానికి తరలివస్తారు.

కార్తీక మాసంలో చివరి రోజున దీపాలు నీటిలో వదిలి పెడతారు. కార్తీకమాసం భక్తి శ్రద్ధలతో చేసుకున్నవారు, నెల మొత్తం అయ్యాకా నీటిలో దీపాలను వదిలిపెడతారు. ఈ రోజును పోలి పాడ్యమి అంటారు. మార్గశిర మాస శుద్ధ పాడ్యమి ఉదయాన్నే ఈ దీపాలు విడిచిపెట్టడం ఆచారం.
మీ సౌలభ్యం కొరకు ఈ సంవత్సరం కార్తీక మాసం లో వచ్చే విశిష్టమైన రోజుల పట్టిక తేదీలు, వారాలతో ఇస్తున్నాము. గమనించగలరు.
కార్తీక శుద్ధ పాడ్యమి బలి పాడ్యమి 20/10/17 – శుక్రవారం
కార్తీక శుద్ధ విదియ భగినీ హస్త భోజనం 21/10/17 – శనివారం
కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి 23/10/17 – సోమవారం
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి/ప్రభోదనైకాదశి 31/10/17 – మంగళవారం
కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి 1/11/17 – బుధవారం
కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం 4/11/17 – శనివారం

పైన చెప్పిన విధంగా కార్తీక మాస నియమాలు అనగా తెల్లవారుజాము స్నానాల, క్రమం తప్పని దీపారాధన, కార్తీక పురాణ పారాయణ, శివ కేశవులను ఇరువురి అర్చన, ఉపవాసాలు ఇలా అన్నీ పవిత్రమైనవే. కార్తీకంలో చిరు దీప దర్శనం కుడా అనంతమైన ఫలాన్ని ఇస్తుంది. అది సంపూర్ణ భక్తి విశ్వాసాలతో చేసి ఆ కార్తీక దామోదరుని కృపకు పాత్రులమవుదాము.