మీన రాశి వారికి జాతక ఫలితాలు
- పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
- శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 02 అవమానం - 04
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందును. శని బలం వలన ఈ సంవత్సరంలో క్రమక్రమేపి శుభ ఫలితాలు కలుగును. గత కాలపు చెడు ఫలితాలు క్రమేపి తొలగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిది.
- Click Here to get 2017 - 2018 Hemalamba Meena Rasi Phalalu in .PDF format
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి గురువు 12- సెప్టెంబర్ - 2017 వరకూ స్వల్పంగా యోగించును. వివాహ ప్రయత్నములు చేయువారికి మిక్కిలి యోగ్యమైన సంబంధమును ఏర్పరచును. వైవాహిక జీవనంలో సంతోషములు ఏర్పడును. 12-సెప్టెంబర్-2017 తదుపరి అంతగా మంచి ఫలితాలను ఇవ్వడు. ఆర్ధికంగా కొద్దిపాటి ఇబ్బందులను ఏర్పరచును.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి శని సంవత్సరం అంతా మంచి అనుకూలమైన ఫలితాలను కలిగించును. లోహ సంబధమైన , కమీషన్ సంబంధమైన వ్యాపారములు చేయువారికి కలసి వచ్చును. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి రాహువు - కేతువు ఇరువురూ సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను కలిగించును.