ప్రతి నెల అమావాస్య రోజు ఇలాగ హనుమంతుడిని పూజిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం
నెలలో ప్రతి అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు.
ఈ పండుగను జరుపుకోలేని వారు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.
మామూలు రోజుల్లో ఇలా పూజించండి
ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి తమలపాకులు సమర్పించి నుదిటిన సింధూరం పెట్టుకోవాలి, ఆ తరువాత దేవుడికి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని ఒక 3 సార్లు చదవాలి “శ్రీరామ రామ రామేతి ,
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే.
(ఈ శ్లోకం మూడు సార్లు పఠించితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం
(ఈ శ్లోకం మూడు సార్లు పఠించితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం
ఆమావాస్య పూట
అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.
“అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యమ్ తవకిన్ వధ
రామదూత కృపా సింథో
మత్ కార్యమ్ సాధయ ప్రభో”
అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు
కామెంట్‌లు